Cine critic Dasari Vignan : మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో హీరోయిన్ గా మొదటి సినిమాతోనే లక్కీ గర్ల్ గా ఎదిగిన సమంత ఆ తరువాత వెను తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్స్ తో దూసుకెళ్ళింది. తమిళం, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ అగ్రహీరోయిన్ గా ఎదిగిన సమంత మొదటి సినిమాలో కలిసి చేసిన హీరో నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చెసుకుంది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తూనే నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చిన సమంత పెళ్ళైన నాలుగేళ్ళ తరువాత విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంత డివోర్స్ తరువాత కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అయినా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఇక మాయోసైటీస్ తో బాధపడుతున్న సమంత కు ఎవరో చేతబడి చేసారు అంటూ పుకార్లు ప్రస్తుత సోషల్ మీడియాలో బాగా వస్తుండగా వీటి మీద సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడారు.
ఆ ఆధ్యాత్మిక వేత్త చేతబడి చేయించాడు…
దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో సమంత ఆరోగ్యం ఇలా కావడానికి ఒక ఆధ్యాత్మిక గురువే కారణం అంటూ రాసారని అవన్నీ అవాస్తవాలు అంటూ తెలిపారు. సమంత ను కావాలనుకున్నా ఆ గురువు ను సమంత తిరస్కరించి నాగ చైతన్య ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు కోపం వచ్చి ఆమె విడాకులు తీసుకునేలా చేసి ఇప్పుడు మానసికంగా ఆలాగే శారీరకంగా సమంత ఇబ్బదిపడేలా చేయాలని ఇలా చేతబడి చేసారు అంటూ చెప్పారు. అందుకోసమే సమంత తాజాగా పళని సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి పూజలు చేసిందని, మెట్ల మీద కర్పూరం పెట్టుకుంటూ వెళ్లి పూజలు చేసిందంటూ కథనాలు రాసారు అయితే అందులో నిజం లేదని విజ్ఞాన్ క్లారిటీ ఇచ్చారు.
సమంత ముందు నుండి హిందూ దేవాలయాలకు వెళ్లడం జరిగిందని తిరుమలకు చాలా సార్లు నడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయంటూ చెప్పారు. ఇక తాను ఇషా ఫౌండేషన్ సద్గురు గారి మాటను బాగా వింటుందని, ప్రతి శివరాత్రికి సద్గురు ఆశ్రమంకి చెన్నై వెళ్తుందని అందులో భాగంగానే వారం పది రోజులు బ్రేక్ తీసుకుని వెళ్లిందని, అలాగే ప్రశాంతత కోసం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందంటూ వివరించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…