Featured

Serial Actress Likitha : సీరియల్స్ లో నా రెమ్యూనరేషన్… ఒకసారి సీరియల్ లో వేసుకున్న డ్రెస్ ఏం చేస్తానంటే… నా బాడ్ హ్యాబిట్స్ అవే…: సీరియల్ నటి లిఖిత

Serial Actress Likitha : జీ తెలుగులో వస్తోన్న ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ లిఖిత ఇప్పుడిప్పుడే నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. కర్ణాటక బెంగళూరుకి చెందిన లిఖిత తెలుగులోనే నటిగా తన ప్రయాణం మొదలు పెట్టింది. మా టీవీ లో వచ్చిన ‘బంగారు పంజరం’ సీరియల్ లో మొదట ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఆ సీరియల్ లో నటనకు అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ సీరియల్ తరువాత మా టీవిలోనే ‘రాఖీ పూర్ణిమ’ అనే మరో సీరియల్ లో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు జీ తెలుగు లో మధ్యాహ్నం సమయంలో వచ్చే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధిచిన విషయాలను లిఖిత తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

నా రెమ్యూనరేషన్… ఆ బట్టలన్నీ ఏం చేస్తానంటే…

లిఖిత చేస్తున్న సీరియల్స్ లో ఇది మూడోది కాగా చదువుకుంటూ నటన వైపు రావడం వల్ల ఒకేసారు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయలేక పోతున్నట్లు చెప్పారు. ఒక్కో సీరియల్ చేస్తూ మరోవైపు చదువుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పిన లిఖిత తన తల్లిని తన వద్దే పెట్టుకున్నట్లు చెప్పారు. ఒక వారం బెంగళూరులో చదువుకుంటే మరో వారం హైదరాబాద్ షూటింగ్స్ లో ఉంటున్నట్లు చెప్పిన లిఖిత రెమ్యూనరేషన్ విషయం నాకు తెలియదని, తల్లి అన్ని విషయలు చూసుకుంటారంటూ చెప్పారు.

డైలీ బేసిస్ మీద శాలరీ ఇస్తారని మాత్రం తెలుసంటూ చెప్పారు. ఇక తనకు వేసిన డ్రెస్ మళ్ళీ వేయడం అంటే నచ్చదంటూ అది నాకున్న పెద్ధ బాడ్ హ్యాబిట్ అంటూ చెప్పారు. ఇక అలా సీరియల్స్ కోసం వేసుకున్న బట్టలను ఇచ్చేస్తానని, డిజైనర్ బట్టలు కావడం వల్ల అవన్నీ నేను వేస్ట్ చేయడం ఇష్టం లేక డిజైనర్స్ వాళ్ళకే ఇచ్చేస్తానని, నా బట్టలే నేను రీపిట్ వేయడానికి ఇష్టపడను అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago