Cine Critic Dasari Vignan : సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్స్ గా మిగలడంతో నెక్స్ట్ వస్తున్న డార్లింగ్ సినిమాల మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. కసిగా డార్లింగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ బాహుబలి అంత రేంజ్ లో హిట్ కొట్టి సత్తా చూపాలని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని భారీ బడ్జెట్ సినిమాలు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ తో ప్రాజెక్ట్ కే, ఇక ఓం రౌత్ దర్శకత్వంలో అదిపురుష్. అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే అలాగే పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇందులో రెండేళ్ల నుండి ఊరిస్తున్న సినిమా అదిపురుష్. ఈ సినిమా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఆఖరికి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంతకాలం రాలేదు.
రాముడుకి మీసాల… ఏంటిది…
ఇక అభిమానులే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తయారు చేసుకుంటూ తమ డార్లింగ్ రాముడి గెటప్ లో ఎలా ఉంటాడో అంటూ అనిమేషన్ చేసి ఆనందించారు. ఇక చివరికి డైరెక్టర్ తాజాగా అధిపురుష్ ఫస్ట్ లుక్ అంటూ ప్రభాస్ రాముడి గెటప్ లో ఆకాశంలోకి విల్లు ఎక్కుపెడుతున్న పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్ ను హ్యాపీ చేసాడు. కానీ ఆ పోస్టర్ లో రాముడి గెటప్ లో ఉన్న ప్రభాస్ కు మీసాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీనిపై పలువురు నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేసారు.
అసలు రాముడికి మీసాలు ఉంటాయా అనే సందేహం అందరికీ వచ్చింది. ఇక వీటిపై సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడారు. రాముడు ఇలా ఉంటాడని ఎవరూ చూడలేదు. మన ముందు తరాల చిత్రకారులు గీసిన బొమ్మల ఆధారంగా రాముడిని ఉహించుకున్నాం మనకు అసలు రాముడికి మీసం, గడ్డం ఉంటుందో లేక క్లీన్ షేవ్ తో ఉంటాడో తెలియదు కాబట్టి డైరెక్టర్ తాను రాముడిని ఎలా చూపాలనుకున్నాడో అలా చూపాడు. ఇక సినిమా పూర్తిగా రామాయణం అనే క్లారిటీ లేదు, కేవలం ఆ కథ స్ఫూర్తి తో వేరే కథను చూపిస్తుండవచ్చు కాబట్టి ట్రైలర్ విడుదల వరకు ఎదురుచూడాల్సిందే. అసలు సినిమా కథ తెలియకుండా రాముడి మీసాల మీద చర్చ అనవసరం అంటూ తెల్చేశారు విజ్ఞాన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…