Imandi Ramarao : ముఖానికి రంగు వేసుకునే వారికి రాజకీయాలు రావు అనే మాట నుండి ఒక సినిమా హీరో సీఎం కుర్చీలో కూర్చుని పాలించిన రాజకీయాలు మనకు కొత్త కావు. ఒకప్పుడు రాజకీయాలు వేరు సినిమా రంగం వేరు. కానీ ఇప్పుడు రాజకీయాలకు సినిమాలు కావాలి, సినిమా వాళ్లకు రాజకీయ నాయకుల అండ కావాలి. అలా సినిమా, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఇక ఎంతో మంది నటులు రాజకీయాల్లో రానిస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో తెలుగు అగ్ర హీరో రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వినిపించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు.
రాజకీయాల్లోకి నాగ్ రాక తప్పదు…
అక్కినేని ఇంటి వారసుడుగా సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోల్లో ఒకడిగా ఉన్న నాగార్జున కానీ అంతకు ముందు అక్కినేని నాగేశ్వరావు గారు కానీ రాజకీయాల్లోకి రాలేదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినపుడు రాజకీయాల్లోకి ఆహ్వానించినా అక్కినేని సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాలను ఏఎన్ఆర్ ప్రభావితం చేసారు. అందరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలను కలిగిండేవారు. ఇక నాగార్జున కూడా తండ్రి బాటలోనే రాజకీయాల్లో లేకపోయినా పదవిలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు. ఇక అలా అటు తెలంగాణ సీఎం తోనూ, ఇటు ఏపీ సీఎం జగన్ తోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు నాగార్జున. అయితే ఇప్పుడు అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే మాట వినిపిస్తుండడం గురించి ఇమంది గారు మాట్లాడుతూ వస్తారు అన్నట్లుగా చెప్పారు.
నాగార్జున గారే స్వయంగా ఇంట్రెస్ట్ లేదని చెప్పినా ఆయన వస్తారు అంటూ అన్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది కనుక ఇపుడే క్లారిటీ ఇవ్వరు కానీ ఆయన విజయవాడ ఎంపీ అభ్యర్థి గా వైసీపీ తరుపున నిలబడే అవకాశం ఉంది అంటూ చెప్పారు. తన ఆస్తులను కాపాడుకోవడం, పనులు జరుపుకోవడం కోసం జగన్ కు సన్నిహితంగానే ఉన్న నాగార్జున రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యకరం కాదని అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు కానీ పొలిటికల్ నాయకుడి పాత్రలో సినిమాలో చేయాలని ఉంది అని నాగార్జున చెప్పడం ఇండైరెక్ట్ గా తన పొలిటికల్ ఎంట్రీ కోసమే అని అభిప్రాయ పడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…