Featured

Relations in Film Industry : సినిమా పరిశ్రమలో మామ అల్లుళ్లు అయినవాళ్ళు వీరే..!

Relations in Film Industry : సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన, కొనసాగుతున్న ప్రముఖ, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు తమ జీవిత భాగస్వాములను సినీ ఇండస్ట్రీలోనే దొరకపుచ్చుకున్నారు.

వీళ్ళు వివాహం చేసుకోవడంతో భారతీయ సినీ పరిశ్రమ లో చాలామంది ప్రముఖ నటులు మామ అల్లుళ్ళు అయ్యారు. ఈ విధంగా మామా అల్లుళ్లు అయిన వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అల్లు రామలింగయ్య కూతురు అయిన సురేఖ ని వివాహం చేసుకొని అతనికి అల్లుడు అయ్యాడు చిరంజీవి. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.

2004 నవంబర్ 18వ తేదీన రజనీకాంత్ పెద్ద కూతురు అయిన ఐశ్వర్యాని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో తమిళ స్టార్ హీరో అయిన రజనీకాంత్ ధనుష్ మామ అల్లుళ్లు అయ్యారు. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మళ్ళీ కలుస్తున్నారంటూ వార్తలు కుడా వస్తున్నాయి..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కళ్యాణ్ దేవ్ ని 2016 మార్చి 28 వ తేదీన పెళ్లి చేసుకుంది. దీంతో కళ్యాణ్ దేవ్ చిరంజీవి మామా అల్లుళ్లు అయ్యారు. కళ్యాణ్ కూడా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.. కానీ దీనిపై అటు శ్రీజ గానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక.. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ ని ప్రేమించి 2015వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. దీంతో అశ్వినీదత్, నాగ అశ్విన్ మామ అల్లుళ్ళయ్యారు.

ప్రముఖ తమిళ, మలయాళం హీరో, నిర్మాత అయిన సీఎల్ ఆనందన్ కుమార్తె డిస్కో శాంతి తొమ్మిది వందల సినిమాల్లో ఐటమ్ సాంగ్ ల లో నాట్యం చేసి భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే ఈ డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో సీఎల్ ఆనందన్ శ్రీహరి మామ అల్లుళ్ళయ్యారు.

1988వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రముఖ నిర్మాత అయిన కే. బాలాజీ కుమార్తె సుచిత్ర ని పెళ్లి చేసుకున్నాడు. సుచిత్ర కూడా తన తండ్రి లాగానే భారతీయ సినిమా నిర్మాత. ఈమె వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటుంది.

రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ కి తల్లిగా నటించిన శరణ్య భారతీయ నటుడైనా పోంవన్నన్ ని పెళ్లి చేసుకుంది. శరణ్య మలయాళ సినిమా దర్శకుడైన ఏ.భాస్కర్ రాజు కుమార్తె కాగా… పోంవన్నన్ భాస్కర్ రాజు మామ అల్లుళ్లు అయ్యారు.

సీఎల్ ఆనందన్ పెద్ద కుమార్తె అయిన లలిత కుమారి ని ప్రకాష్ రాజు 1994వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని 2009వ సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో సీఎల్ ఆనందన్ కి శ్రీ హరి తో (భార్య రెండవ కుమార్తె డిస్కోశాంతి) పాటు ప్రకాష్ రాజ్ కూడా అల్లుడు అయ్యాడు.

సీనియర్ హీరోయిన్ నిరోషా రాధా రాంకీ కి పిలవబడే రామకృష్ణన్ ని 1995వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. నిరోషా రాధా ప్రముఖ నటుడు రాజకీయవేత్త అయిన మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కుమార్తె కాగా… అతడికి రాంకీ అల్లుడు అయ్యాడు. మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కి సీనియర్ నటీమణి రాధిక కూడా కూతురే. అయితే రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. దీంతో శరత్ కుమార్ కూడా మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ అల్లుడు అయ్యాడు.

2001వ సంవత్సరంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా ని పెళ్లి చేసుకున్నాడు. ట్వింకిల్ ఖన్నా రాజేష్ కన్నా కుమార్తె కాగా… అతడికి అక్షయ్ కుమార్ అల్లుడు అయ్యాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago