Cini Critics Damu Balaji & Dasari Vignan : కుప్పంలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పాల్గొని అక్కడే గుండె పోటు రావడంతో 23 రోజులుగా బెంగళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటూ చివరికి మరణించిన నందమూరి తారకరత్న మరణించి ఆయన కుటుంబానికి తీరని బాధను మిగిల్చారు. ముఖ్యంగా ముగ్గురు పిల్లలను ఆయన భార్య అలేఖ్య రెడ్డి ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోయినా ప్రేమకు విలువనిచ్చి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో కన్నవాళ్లకు దూరమాయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే బాబాయ్ బాలకృష్ణ ద్వారా మళ్ళీ కుటుంబంలోకి కలవబోతున్న తారకరత్న ను మృత్యువు కాబళించింది. ఇక ఆయన తండ్రి మోహన్ కృష్ణ కు తారకరత్న కు దాదాపు పదేళ్లు మాటలు లేవు కాగా తారకరత్న చావుతో పోరాడుతున్నాడు హాస్పిటల్ లో ఉన్నపుడు ఆయన వెళ్ళారో లేదో స్పష్టత లేదు. ఇక మోహనకృష్ణ గారు తారకరత్న ఇంటికి ఆయన శవాన్ని చూడటానికి వెళ్లకపోవడం మీద అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇదే విషయం గురించి సినీ క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ తమ విశ్లేషణ అందించారు.
ఇంత మూర్ఖంగా కూడా ఉంటారా…
దాము బాలాజీ, దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ తారకరత్న ప్రేమ వివాహం వేరే కులం అమ్మాయిని అందునా విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆయన తల్లిదండ్రులు ఆయనను దూరం పెట్టారు. అయితే కొడుకు మృత్యువుతో పోరాడుతున్న సమయంలో కూడా ఇలా పంతాలకు పోవడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు. ఇక తారకరత్న మరణించాక ఆయన మృత దేహాన్ని మొదట మోహన్ కృష్ణ గారి ఇంటికి తరలించాలని భావించినా తారకరత్న కట్టించుకున్న ఇంటికే తరలించాలని భార్య ఇతర బంధువులు కోరడంతో అక్కడికే తరలించారు. అయితే మోహన కృష్ణ బ్రతికుండగా నేను నీ ఇంట్లో అడుగుపెట్టను అని అన్ననందుకు కొడుకు శవాన్ని చూడటానికి కొడుకు ఇంటికి వెళ్ళలేదు మోహనకృష్ణ గారు.
ఈ విషయం అందరినీ విస్మయానికి గురి చేసింది. కొడుకు చనిపోయాక కూడా ఇంత పంతం ఎందుకు అంటూ విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న శవాన్ని తరలించిన తరువాత అక్కడికి వచ్చి కొడుకును చూసి ఏడ్చారు కానీ కోడలిని కానీ మనవడు మనవరాళ్ళను దగ్గరకు తీసుకోలేదు. అక్కడ వారిని అక్కున చేర్చుకుని ఉంటే ఒక మంచి సందేశం ఇచ్చినట్టుండేది. కానీ ఆలా చేయలేదు. ఈ సంఘటనతో అలేఖ్య రెడ్డి ని కానీ ఆమె పిల్లలను కానీ వారు దగరికి తీసుకోరనే విషయం అర్థమైంది అంటూ దాము బాలాజీ, దాసరి విజ్ఞాన్ అభిప్రాయ పడ్డారు. కొడుకు మరణించాక కూడా ఇంకా పంతం, పగ ఉండటం మూర్ఖత్వం అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…