Senior Journalist Bhardwaja : నందమూరి తారకరామారావు మనవడిగా మాత్రమే తారకరత్న అందరికీ పరిచయం. అయితే తారకరత్న తండ్రి వైపు బ్యాక్ గ్రౌండ్ ఎంతో ఘనం అలాగే తల్లి వైపు కూడా అంతే ఘనంగా ఉంది. తల్లి శాంతి గారి తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. తారకరత్న గారు శివరాత్రి నాడు మరణించిన అనంతరం ఆయన వ్యక్తిగత వివరాలను అలాగే ఆయన ఫ్యామిలీ గురించిన మరింత సమాచారం కోసం అందరూ వెతుకుతున్నారు. ఇక ఆయన తల్లి బ్యాక్ గ్రౌండ్, ఆమె తండ్రి ఎవరు అనే విషయాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వివరించారు.
శాంతి గారి తండ్రి ఫేమస్ నిర్మాత…
భరద్వాజ గారు మాట్లాడుతూ మోహన్ కృష్ణ భార్య శాంతి గారి తండ్రి ఫేమస్ నిర్మాత యూ విశ్వేశ్వరావు గారు కూడా కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన వారే అలాగే ఎన్టీఆర్ గారికి బంధువే. అయితే సినిమాల్లో ప్రయత్నించాలి అనుకుని మధ్యలో వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం చేద్దామని భావించి మళ్ళీ ఎన్టీఆర్ సలహా మేరకు సినిమాల్లోకి వచ్చిన ఆయన ప్రజానాయకుడు గా ఎన్టీఆర్ ను నిలబెట్టిన సినిమాలను తీసారు. దేశోద్దారకుడు, కంచుకోట, నిలువు దోపిడీ, పెత్తందారులు వంటి చిత్రాలను నిర్మించారు.
ఇక ఆయన ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినపుడు కూడా సలహాలను ఇచ్చేవారు. అలా ఇద్దరూ స్నేహంగా ఉండేవారంటూ భరద్వాజ తెలిపారు. ఇక వారి స్నేహంను బంధుత్వంగా మారుస్తూ ఆయన కూతురు శాంతిని ఎన్టీఆర్ కొడుకు మోహన కృష్ణ కి ఇచ్చి పెళ్లి చేసారు. కోవిడ్ సమయంలో విశ్వేశ్వరావు గారు మరణించారు. తారకరత్న సినిమా ప్రయాణం కూడా విశ్వేశ్వరయ్య గారు చూసారు. అలా తారకరత్న నాన్న తరుపున వాళ్ళు అమ్మ తరుపున బ్యాక్ గ్రౌండ్ గొప్పగా ఉన్నా సింపుల్గా లో ప్రొఫైల్ మైంటైన్ చేసాడు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…