Udayabhanu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ పేరు గుర్తుకు వస్తుంది. ఎలాంటి ఈవెంట్ జరిగినా తప్పనిసరిగా సుమా అక్కడ ఉండాల్సిందే. అయితే ఒకప్పుడు సుమా తరహాలోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి యాంకర్లలో ఉదయభాను ఒకరు. ఈమె ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉండేవారు.
ఇలా ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఉదయభాను కు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈమె ఇండస్ట్రీకి కూడా దూరం అవుతూ వచ్చారు.. ఇలా ఇండస్ట్రీకి ఉదయభాను దూరం కావడానికి ప్రముఖ సింగర్ సునీత కారణమని ఓ విషయంలో సింగర్ సునీత తనని బాగా హార్ట్ చేసింది అంటూ పరోక్షంగా ఉదయభాను వెల్లడించారు.
అమెరికాలో నిర్వహించిన ఈవెంట్లో సునీత అవమానించిందని ఓ కార్యక్రమంలో పరోక్షంగా ఉదయభాను చెప్పడంతో ఈ విషయంపై సునిత స్పందించారు.ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు అసలు తెలియదు. నాతో సరిగా మాట్లాడేది కాదు. పలకరించినా పక్కకు వెళ్లిపోయేది. నిజానికి నేను ఆ ఈవెంట్ కు ఉదయభానుని అసలు పిలవలేదు.
సింగర్ సునీత..
ఆర్గనైజర్స్ హోస్ట్ చేయడానికి పిలిచారు. ఆ ఈవెంట్లో ఉదయభాను వేదిక మీదకు వెళ్తుంటే నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉండే ఓ ట్రాజిక్ మ్యూజిక్ కొట్టారట. ఆ విషయాన్ని ఆమె అవమానంగా భావించి తనని నేను అవమానించాను అంటూ ఫీల్ అయిందని సునీత క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలోనే మరి కొంతమంది ఈమెను టార్గెట్ చేస్తూ తననీ కెరియర్ పరంగా తొక్కేసారని అందుకే ఉదయభాను ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…