గత 2 నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు టాలీవుడ్ కూడా షూటింగ్స్, సినిమాల రిలీజ్ లు లేకుండా ఉండాల్సి వచ్చింది. అయితే దశల వారిగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఇటీవల కొన్ని సడలింపులతో కొన్ని ఇండస్ట్ట్రీస్, కంపెనీస్, ప్రభూత్వ కార్యాలయాలు పనిచేసేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమానే నమ్ముకొని ఉన్న ఎందరికో ఉపాది దొరకాలన్న ఆలోచన అలాగే ఇండస్ట్రీ వాళ్ళకి మంచి జరగాలన్న సంకల్పంతో సినీ పెద్దలు అంతా కలిసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిపిన చర్చలు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చాయి.
సినీరంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనితో సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కోసం రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణతో పాటుగా థియేటర్లలో సినిమా ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం కె.సి.ఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని, అలాగే రానున్న పరిస్థితులను బేరీజు వేసుకొని సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఆ తర్వాత షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు. దీంతో సినిమా రంగానికి చెందిన వారందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఈ జాబితాలో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా కేసీఆర్‌కు తన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన చిత్ర రంగాన్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకురావడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ చూపిన చొరువ చాలా అభినందనీయమని ఆయన అన్నారు. తాను తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఇలా లాక్‌డౌన్ కారణంగా అన్నీ కార్యక్రమాలు నిలిచిపోయాయని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకునేందుకు రెడీ అవుతున్నట్లు ఆయన తెలిపారు.
సినీ రంగానికి చెందిన తమ సమస్యలను కేసీఆర్ చాలా ఓపికగా విన్నారని, ఆయన తమపట్ల చూపిన అభిమానానికి సినీ రంగం తరఫున కృతజ్ఞతలు తెలిపాడు.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…