టాలీవుడ్ హీరోలలో అప్పట్లో ప్రభాస్ హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఆరడగులకు మించిన హైట్, వెడల్పాటి శరీరం కలిగిన ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకం వచ్చేది. ఆ తరువాత ఆయన్ని మించిన హైట్ కలిగిన హీరోగా రానా, వరుణ్ తేజ్ లాంటి వారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా రానా హైట్ పై కూడా పెద్ద చర్చ నడిచింది. వెడల్పాటి చేతితో ఆజాను బాహుడైన రానా ఫిజిక్ యాక్షన్ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఆయన హైట్ మరియు ఫిజిక్ కారణంగానే బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఎదుర్కొనే భల్లాల దేవ పాత్రకు రాజమౌళి ఎంపిక చేయడం జరిగింది.
కాగా టాలీవుడ్ లో త్వరలో మరో జైన్ట్ హీరో రానున్నాడని అర్థం అవుతుంది. అతనెవరో కాదు విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ దగ్గుబాటి. మొన్న జరిగిన రానా మిహికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలో చాలా కాలం తరువాత దర్శనమిచ్చాడు అర్జున్. టీనేజ్ కూడా నిండని అర్జున్ అప్పుడే ఆరడుగుల హైట్ చేరుకున్నాడని తెలుస్తుంది. టీనేజ్ లోనే ఇంత హైట్ ఉన్న అర్జున్ తన అన్నయ్య రానా హైట్ కూడా అధిగమించేస్తాడు అనిపిస్తుంది.
అప్పట్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఆడియో విడుదల వేడుకలో అర్జున్, మహేష్ కుమారుడు గౌతమ్ తో కలిసి సందడి చేశాడు. ఇక అర్జున్ తాజా లుక్ చూస్తే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో టాల్ హీరో వస్తున్నాడు అనిపిస్తుంది. ఐతే ఈ విషయంలో పవన్ కుమారుడు అకీరా అందరికంటే ముందున్నాడు. 16ఏళ్ల వయసులో ఉన్న అకీరా ప్రస్తుత హైట్ 6.4 అంగుళాలు కావడం విశేషం.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…