Colours Swathi : తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది స్వాతి రెడ్డి. ఇప్పటికీ తెలుగు అభిమానుల మదిలో స్వాతి రెడ్డి, కలర్స్ స్వాతి లానే గుర్తుండి పోయింది. తరువాత క్యారెక్టర్లు, హీరోయిన్లకి డబ్బింగులు చెప్పడంతో తన కెరీర్ ని మొదలు పెట్టింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాతో నటిగా మారిన స్వాతి అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి 2018లో వికాస్ తో వివాహం జరిగిన తరువాత సినిమాలకి దూరంగా ఉంటోంది. అయితే తాజాగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్న స్వాతి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
బుర్ఖా వేసుకుని రైల్వే స్టేషన్ లో స్వాతి…
సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనందపడే విషయమే అయినా ఒక్కోసారి అదే ఇబ్బందిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే మొహం చూపించకుండా వెళ్లాల్సిన పరిస్థితి. సాధారణ మనిషి లాగా ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళలేరు. ఇపుడు స్వాతి కూడా అలానే బయట పబ్లిక్ లో వెళ్ళడానికి బుర్ఖా వేసుకుంది. ఎవరూ తనని గుర్తుపట్టకూడదని బుర్ఖా వేసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి తనకి నచ్చిన పుస్తకాలను అక్కడ కొనుక్కుని అక్కడ టీ తాగి రైలులో ప్రయాణించింది.
ట్రైన్ ఎక్కేటపుడు మొహం కి ఉన్న ముసుగు తీసి ట్రైన్ లో వేరే ఊరు వెళ్లిన స్వాతి ఎక్కడికి వెళ్ళింది మాత్రం చెప్పలేదు కానీ మిగిలినదంతా ఫోటోల రూపంలో నెట్టింట్లో పోస్ట్ చేసింది. అందులో ఒక ఫొటోలో మెట్టెలు లేకుండా ఉన్న ఫోటోను చూసి జనాలు విడాకుల మీద హింట్ ఇస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…