Yadamma Raju: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో టీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి ఇతను స్టేల్లాని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ రీల్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఈ జంట స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నఫలంగా యాదమ్మ రాజు ప్రమాదానికి గురి కావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్టెల్లా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి యాదమ్మ రాజు పైకి లేచి నడవలేని పరిస్థితిలో ఉండగా స్టెల్లా తనని నడిపిస్తూ ఉన్నారు. ఇక ఈ వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ యాదమ్మ రాజుకు కాలు విరిగిందని ప్రస్తుతం తాను కోలుకుంటున్నారని తెలిపారు. అయితే తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈమె పోస్ట్ చేశారు.
ఈ విధంగా యాదమ్మ రాజు నడవలేని పరిస్థితిలలో ఉన్న దానిని కూడా వారి వ్యూస్ లైక్స్ కోసం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది స్టెల్లా వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా రీల్స్ చేయడం అవసరమా అంటూ మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…