Movie News

Comedian Ali: చిరంజీవి గారి మొహం చూడటం ఇష్టంలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కమిడియన్ అలీ..!

Comedian Ali: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లుగా ఎంతోమంది గుర్తింపు పొందారు. ఇలా కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారిలో అలీ కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ కొన్ని వందలకు పైగా సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలీ ఇప్పటికీ వరుస సినిమాలను నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు.

ఇలా సినిమాలలో నటిస్తూ వాటిని నిర్మించటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ అనే షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల సుమ హోస్ట్ గా సరికొత్త టెలివిజన్ షో ప్రారంభమైంది. “సుమ అడ్డా” పేరుతో ఈటీవీలో ఈ షో ప్రసారం కానుంది. యాంకర్ గా బాగా పాపులర్ అయిన సుమ ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో సందడిగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో షోలలో హోస్ట్ గా వ్యవహరించిన సుమ సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో అలీ, పోసాని కృష్ణ మురళితో పాటు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా సందడి చేశారు. అందరిని తన మాటలతో నవ్వించే సుమ ఈ షో లో కూడా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో ఒక ఆట ఆడుకుంది. ఇక అలీ పోసాని కృష్ణమురళి గారిని కూడా విచిత్రమైన ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలో అలీ గారితో మాట్లాడుతూ.. చిరంజీవి గారు మీరు కలిస్తే అందరినీ నవ్విస్తారంట? అని అడగగా..అలీ స్పందిస్తూ..

Comedian Ali: చిరంజీవిని ఎక్కువసేపు చూడలేను…


చిరంజీవి గారిని కలిసినప్పుడు నేను ఎక్కువసేపు ఆయన మొహం చూడలేను. ఎందుకంటే నన్ను చూడగానే ఆయన ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అందువల్ల నేను ఆయన మొహం చూడను అంటూ చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక పోసాని కృష్ణమురళి గారిని కూడా తనదైన ప్రశ్నలు వేసి ఒక ఆట ఆడుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago