Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన హృతిక్ రోషన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. అయితే హృతిక్ రోషన్ ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటిస్తూ ఆ సినిమా సన్నివేశాల కోసం డూప్ లేకుండా తానే స్వయంగా యాక్షన్ సన్నివేశాలలో నటించేవాడు.
ఇలా హృతిక్ రోషన్ బాలీవుడ్ యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే ఇలా యాక్షన్ సన్నివేశాలలో నటించటానికి హృతిక్ రోషన్ చాలా కష్టపడవలసి వచ్చేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.ఇటీవల తన ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమాలలో యాక్షన్ సన్నివేశాల కోసం తాను చాలా కష్టపడవలసి వచ్చేదని, కొన్ని సందర్భాలలో ఇలా యాక్షన్ సన్నివేశాలలో నటించడం వల్ల అనేక గాయాలు కూడా అయ్యేవని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తాను వార్ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టపడ్డానని , నా జీవితంలో నేను అత్యంత కష్టపడిన సినిమా ఇదేనని వెల్లడించాడు. ఈ సినిమా కోసం శారీరకంగా తనని తనని తాను మార్చుకోవడానికి తన శరీరాన్ని ఎంతో కష్టపెట్టాడని,ఇలా శారీరకంగా బాగా కష్టపడటంతో ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని హృతిక్ రోషన్ వెల్లడించారు.
ఈ డిప్రెషన్ కారణంగా అసలు బ్రతుకుతానా లేక చనిపోతానా అన్న భావన తనలో కలిగిందని హృతిక్ వెల్లడించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వార్ సినిమా 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వటంతో దానిబడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇటీవల హృతిక్ రోషన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా హృతిక్ రోషన్ ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటు ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…