తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మపై తానూ చేసిన వ్యాఖ్యలపై జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు అయన ఒక వీడియో రిలీజ్ చేసారు. అయితే ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు.. మేము అందరం కలిసి చాలా సరదాగా పని చేసుకుంటాం.. అలాగే ఎవరికీ ఏ సమస్య వచ్చినా అందరం కలిసి సాల్వ్ చేసుకుంటాం. అన్ని ప్రాంతాల ప్రేమాభిలాయలతోనే మేము అందరం ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం అంటూ వివరణ ఇచ్చారు.
ఇక ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలోని స్కిట్ లో తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా హైపర్ ఆది మాట్లాదారంటూ.. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎల్బీనగర్‌లో కేసు కుడా పెట్టారు. అయితే మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.
అయితే హైపర్ ఆది బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ నిన్న రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అయితే అవేమీ తాము కావాలని చేయలేదు అని హైపర్ ఆది తెలిపారు. అయితే ఆ షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…