Movie News

Comedian Raghu: కమెడియన్ రఘు ఇల్లు చూశారా… ఎంత అందంగా ఉందో…వైరల్ అవుతున్న ఫోటోలు!

Comedian Raghu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రఘు ఒకరు. ఈయన తన సినీ కెరియర్ల దాదాపు 150 సినిమాలలో నటించారు. ఇలా ఇన్ని సినిమాలలో నటించిన తనకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేకపోయింది.

ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈయన అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రఘు అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలోనూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈయన అనంతరం ఈ బుల్లితెర కార్యక్రమాల నుంచి కూడా తప్పుకున్నారు.

ఇలా వెండితెరపై బుల్లితెరపై ఈయనకు అవకాశాలు లేకుండా పోవడంతో ఒకానొక సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమవుతున్నానని ఈయన వెల్లడించారు.అదే సమయంలో ఒక బార్లో వైన్ అమ్ముతూ కనిపించారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఈయన ఒక బార్ లో పనిచేయడమే కాకుండా ప్రస్తుతం రెండు వైన్ షాపులకు ఓనర్ గా మారిపోయారు.

ఇలా వైన్ షాపులను నడుపుతూ వ్యాపారంలో మంచి సక్సెస్ అయినటువంటి రఘు తాజాగా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం ఇంద్ర భవనాన్ని తలపించేలా ఈయన ఇంటి నిర్మాణాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించారు.


Comedian Raghu: మొక్కలతో ఇంటిని అలంకరించిన రఘు..

ఇక ఈయనకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఉన్నట్టు ఈ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది ఇంటి చుట్టూ ఉన్న పచ్చదనం ఈయనకు మొక్కలు అంటే ఎంత ఇష్టమో తెలియచేస్తున్నాయి. ఇక ఇంట్లో ప్రతిరోజు వంటకు సరిపడే కూరగాయలను కూడా ఈయన తన ఇంట్లోనే పండిస్తున్నారు.ఇక ఇంట్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి అలంకరణ వస్తువులు లేకుండా అన్ని కూడా కొండపల్లి కొయ్య బొమ్మలతో తన ఇంటిని అలంకరించారు.ప్రస్తుతం రఘు ఇంటికి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ కావడంతో నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago