Movie News

KGF Movie: “కేజిఎఫ్” ఒక చెత్త.. “యష్” నీచ్ కమీనే అంటూ ఫైర్ అయిన డైరెక్టర్! చేసిన రెండు సినిమాలకే ఇంత బలుపా అంటూ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..!

KGF Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇకపోతే కేజిఎఫ్ చాప్టర్ టు సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధించిందో మనకు తెలిసిందే.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా గురించి కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేష్ మహా కెజిఎఫ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలోని రాఖీ బాయ్ పాత్ర గురించి బూతులు తిడుతూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మహా మాట్లాడుతూ..మేము కొన్ని విలువలతో సినిమాలు తీస్తున్నామని కొంతమంది ఆ సినిమాలను ఓటీటీ సినిమాలు అని డీగ్రేడ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

అదే సినిమా క్లైమాక్స్ లో తవ్విన వాళ్లకు ఇల్లు ఇచ్చి బంగారాన్ని సముద్రంలో పడేసే నీచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని ఈయన కేజిఎఫ్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలో ప్రతి తల్లి తన కొడుకు గొప్పోడు కావాలని చెబుతుంది అంటే ఆయన నలుగురికి సహాయపడాలని అర్థం. చివర్లో హీరో బంగారం పోగేసి ఆ బంగారాన్ని ఎక్కడో పార దొబ్బుతాడని ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఉంటారా అని వెంకటేశ్ మహా కామెంట్లు చేశారు.

KGF Movie: తోటి డైరెక్టర్లను డీగ్రేడ్ చేయడం మంచిది కాదు..


అలాంటి కుత్తే కావాలని తల్లి అడగగా… ఇలాంటి కథలను సినిమాగా తీసి మనం ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నామంటే ఈయన కే జి ఎఫ్ సినిమా గురించి మండిపడ్డారు అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందరికీ ఒకే రకమైన సినిమాలు నచ్చాలని ఏమీ లేదు ఒక్కొక్కరికిఒక్కో సినిమా నచ్చుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు చేసింది రెండే రెండు సినిమాలు అందులో ఒకటి రీమేక్, మరొకటి ఆడింది.. ఆమాత్రానికే వెయ్యికోట్లు కొల్లగొట్టిన సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుటుంది అంటూ మండి పడుతున్నారు.. మరికొందరు మాత్రం డైరెక్టర్ వెంకటేష్ మహాకు మద్దతు తెలుపుతూ ఆయన ఆవేదన కూడా అర్థం చేసుకోవాలిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ మహా “కేరాఫ్ కంచరపాలెం”, “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” సినిమాలు డైరెక్ట్ చేసాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago