KGF Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇకపోతే కేజిఎఫ్ చాప్టర్ టు సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధించిందో మనకు తెలిసిందే.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా గురించి కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేష్ మహా కెజిఎఫ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలోని రాఖీ బాయ్ పాత్ర గురించి బూతులు తిడుతూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మహా మాట్లాడుతూ..మేము కొన్ని విలువలతో సినిమాలు తీస్తున్నామని కొంతమంది ఆ సినిమాలను ఓటీటీ సినిమాలు అని డీగ్రేడ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
అదే సినిమా క్లైమాక్స్ లో తవ్విన వాళ్లకు ఇల్లు ఇచ్చి బంగారాన్ని సముద్రంలో పడేసే నీచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని ఈయన కేజిఎఫ్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలో ప్రతి తల్లి తన కొడుకు గొప్పోడు కావాలని చెబుతుంది అంటే ఆయన నలుగురికి సహాయపడాలని అర్థం. చివర్లో హీరో బంగారం పోగేసి ఆ బంగారాన్ని ఎక్కడో పార దొబ్బుతాడని ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఉంటారా అని వెంకటేశ్ మహా కామెంట్లు చేశారు.

KGF Movie: తోటి డైరెక్టర్లను డీగ్రేడ్ చేయడం మంచిది కాదు..
అలాంటి కుత్తే కావాలని తల్లి అడగగా… ఇలాంటి కథలను సినిమాగా తీసి మనం ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నామంటే ఈయన కే జి ఎఫ్ సినిమా గురించి మండిపడ్డారు అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందరికీ ఒకే రకమైన సినిమాలు నచ్చాలని ఏమీ లేదు ఒక్కొక్కరికిఒక్కో సినిమా నచ్చుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు చేసింది రెండే రెండు సినిమాలు అందులో ఒకటి రీమేక్, మరొకటి ఆడింది.. ఆమాత్రానికే వెయ్యికోట్లు కొల్లగొట్టిన సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుటుంది అంటూ మండి పడుతున్నారు.. మరికొందరు మాత్రం డైరెక్టర్ వెంకటేష్ మహాకు మద్దతు తెలుపుతూ ఆయన ఆవేదన కూడా అర్థం చేసుకోవాలిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ మహా “కేరాఫ్ కంచరపాలెం”, “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” సినిమాలు డైరెక్ట్ చేసాడు.


































