Featured

‘ఆమాట కావాలని అనలేదు..’ సన్నీ, కాజల్ కు క్షమాపణలు చెప్పిన కమెడియన్ సుదర్శన్..

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం సండే ఎంతో ఫన్ డే గా జరుగుతుంది. ఈ క్రమంలోని నాగార్జున బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి హౌస్ సభ్యులతో ముచ్చటిస్తారు. ఈ ఆదివారం బిగ్ బాస్ వేదికపైకి అనుభవించు రాజా టీమ్ వచ్చి సందడి చేశారు. రాజ్ తరుణ్, కౌశిక్, నెల్లూరు సుదర్శన్ కాసేపు బిగ్ బాస్ వేదికపై హౌ సభ్యులతో మాట్లాడుతూ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ సన్నీ కాజల్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. కాజల్ అలిగినప్పుడు సన్నీ వచ్చి ఓదార్చడం ఎంతో రొమాంటిక్ గా ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయం విన్న సన్నీ వారి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ విధంగా నెల్లూరు సుదర్శన్ సన్నీ, కాజల్ రిలేషన్ గురించి ఇలా మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున సుదర్శన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సుదర్శన్ స్పందించారు.

నేను కావాలని అలా అనలేదని పొరపాటు జరిగిందని ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్నీ, కాజల్ ఆమె కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నానని ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

11 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

11 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

11 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

11 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

12 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

12 hours ago