టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈ వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సిరీస్ లో సమంత చేసిన పాత్ర గురించి రాజ్ అండ్ డీకే షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో నటించడం కోసం తమిళం తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందని మొదటగా భావించాము. అదే సమయంలో సమంత తమిళంలో నటించిన సూపర్ డీలక్స్ చూసి ఈ సిరీస్ కోసం సమంతను ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే రాజీ పాత్రలో నటించడానికి సమంత పూర్తిగా న్యాయం చేసింది.
సమంత ఈ పాత్రలో అంచనాలకు మించి నటించారని ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో డూప్ పెడతామని చెప్పినప్పటికీ ఆమె వినకుండా ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని ఇందులో నటించారని వెల్లడించారు. రాజీ పాత్ర ఎంతో భావోద్వేగమైన పాత్ర అని ఇందులో సమంత వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటనలు ఇప్పటికీ తమకు గుర్తు ఉన్నాయని తెలిపారు.
రాజీ పాత్రలో ఉన్నటువంటి ఫైట్ సన్నివేశాలలో ఆమె చేతులకు రక్తం కారుతున్న కానీ సమంత డూప్ లేకుండా ఈ పాత్రలో నటించారని ఆమెపై రాజ్ అండ్ డీకే ప్రశంసలు కురిపించారు. అలాగే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 3 గురించి మాట్లాడుతూ ఇంకా ఈ సిరీస్ స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదని ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే వెల్లడించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…