బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మాజీ ప్రపంచ సుందరిగా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె 2018 డిసెంబర్ నెలలో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను రాజస్థాన్‌లోని హిస్టారికల్ ప్యాలెస్ జోద్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
వీరి వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ వీరి రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు. ఇలా ఎంతో సంతోషంగా అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రియాంక చోప్రా
జోనాస్ అని ఉండేది తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన పేరు చివర చోప్రా జోనాస్ ని తొలగించి కేవలం ప్రియాంక అని మాత్రమే ఉంచుకుంది.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకే ప్రియాంక తన భర్త పేరును తొలగించిందా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్యల మాదిరిగానే వీరి వ్యవహారం కూడా ఉంది.సమంత భాటలోని ప్రియాంక కూడా పయనిస్తుందని వారి మాదిరే వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారా..అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విషయంలో జరిగినట్లుగానే ప్రియాంక , జోనాస్ విషయంలో జరుగుతుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రియాంక చోప్రా అభిమానులు ఈ విషయం గురించి ఎంతో ఆందోళన చెందుతున్నారు. మరి ప్రియాంక చోప్రా తన పేరును మార్చడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…