Yadamma Raju: యాదమ్మ రాజు పటాస్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈయన అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కూడా తన కామెడీ పంచ్ డైలాగుల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తారు ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన యూట్యూబర్ స్టెల్లా ప్రేమలో పడ్డారు దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇలా ఏడాదిన్నర పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరూ తాజాగా సోషల్ మీడియా వేదికగా శుభవార్తను తెలియజేశారు.
తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని శుభవార్తను యాదమ్మ రాజు వెల్లడించారు అంతేకాకుండా తన భార్య ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..ఎనిమిదేళ్ల అపురూపమైన ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక బంధం, ఊహించని సవాళ్లు, నవ్వులు, కన్నీళ్లు.. ఇలా జీవితంలోని ప్రతిక్షణం మమ్మల్ని మరింత దగ్గర చేశాయి.
మరొకరు రాబోతున్నారు…
ఇప్పుడు మా బంధం మరింత బలపడింది. మా కుటుంబంలోకి మరొకరు వస్తున్నారని చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మాపై మీరు చూపిస్తున్న దీవెనలు, మద్దతు, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని తన ఆనందాన్ని తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…