Categories: FeaturedMovie News

Mahesh Babu: ఇకపై ఇలాంటి చెత్త సినిమాలు చేయకు.. మహేష్ కి వార్నింగ్ ఇచ్చిన పొలిటీషియన్?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి. త్వరలోనే ఈయన పాన్ ఇండియా సినిమా కాకుండా పాన్ వరల్డ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారు. ఇలాంటి తరుణంలోనే మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలను చూసి తన తండ్రి కృష్ణ గారు రివ్యూ ఇచ్చేవారట. తన సినిమాలకు తన తండ్రి క్రిటిక్ అని మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో తెలిపారు.

తన సినిమా బాగా లేకపోతే నాన్న అసలు ఏమి మాట్లాడరు బాగుందంటే ఓకే బాగుందని చెబుతారు. నాన్న బాగుంది అంటే ఆ సినిమా థియేటర్లలో బ్లాక్ బాస్టర్ అవుతుందని మహేష్ బాబు వెల్లడించారు. ఇలా నాన్నతోపాటు తన సినిమాలకు మరొక క్రిటిక్ ఉన్నారని మహేష్ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాదని రాజకీయాలకు చెందిన వ్యక్తి అని తెలిపారు.

ఈ రాజకీయ నాయకుడు మహేష్ బాబు సినిమా కనుక చూస్తున్నారు అంటే మహేష్ బాబు చాలా భయపడతారట. ఈయన ఎలాంటి రివ్యూ ఇస్తారో అని టెన్షన్ ఉంటుందట. మరి మహేష్ బాబు సినిమాలకు క్రిటిక్ అయినటువంటి ఆ పొలిటిషన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు మాజీ మంత్రి కేటీఆర్.

కేటీఆర్..
మహేష్ బాబు కేటీఆర్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు మహేష్ నటించిన సినిమాలన్నీ కూడా కేటీఆర్ తప్పకుండా చూడటమే కాకుండా ఆ సినిమా ఎలా ఉంది అనే విషయాలను కూడా మహేష్ కి ఫోన్ చేసి మరి చెబుతారట. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా చూసి మహేష్ ఇలాంటి చెత్త సినిమాలు ఇకపై చెయ్యకు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా మహేష్ బాబు వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago