Game Changer: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఈయన ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు కానీ ఇటీవల కాలంలో కృష్ణవంశీ సినిమాలను పూర్తిగా తగ్గించారు అయితే ఈయన చేసిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
ఇదిలా ఉండగా కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మురారి. ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా త్వరలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తిరిగి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ రామ్ చరణ్ సినిమా గురించి ప్రశ్నించారు.మీరు గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా అని ప్రశ్నించాడు. దీనికి కృష్ణవంశీ సమాధానం ఇస్తూ చరణ్ నా బిడ్డలాంటివాడు. గేమ్ ఛేంజర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
విజినరీ డైరెక్టర్..
ఈ క్రమంలోనే మరొక నెటిజన్ ఈ కామెంట్లకు కొనసాగింపుగా కామెంట్ చేస్తూ..జరగండి జరగండి సాంగ్ విన్న తర్వాత గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుందని కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై ఈయన స్పందిస్తూ సినిమా గురించి ఇలాంటి నెగెటివిటీ వద్దు తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ.. శంకర్ అవుట్ డేట్ డైరెక్టర్.ఆయన పనైపోయింది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుందని మరో నెటిజన్ అన్నారు. అలా మాట్లాడడం తప్పు. శంకర్ గొప్ప విజన్ ఉన్న దర్శకుడు. ఒక పాట చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు అంటూ ఈయన తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…