Renuka Chowdary: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. ఏకంగా ఎస్సై చొక్కా పట్టుకుని నిలదీసిన రేణుకా చౌదరి?
Renuka Chowdary: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై గత కొద్దిరోజుల నుంచి ఈడీ అధికారులు తీవ్రస్థాయిలో ఆయనను విచారణ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వచ్చారు.
విషయం తెలిసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను రాజ్ భవన్ వద్దకు వెళ్లకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించి వీరిని రాజ్ భవన్ వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల మధ్య కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక కొందరు కాంగ్రెస్ నేతలు పోలీసుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు.ఇలా కొంత సమయం పాటు పోలీసులకు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో ఆ స్థానికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇకపోతే ఈ ఉద్రిక్తతలో భాగంగా కాంగ్రెస్ నేతలు డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న బట్టి విక్రమార్క , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకుని నిలదీశారు. దీంతో పోలీసులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…