Sriram : తెలుగు తెరకు శ్రీరామ్ గా పరిచయమైన ‘రోజా పూలు’ సినిమా హీరో అసలు పేరు శ్రీకాంత్. చెన్నై కి చెందిన శ్రీరామ్ తెలుగులో 2002 లో వచ్చిన రోజా పూలు సినిమాతో అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. శ్రీరామ్, భూమిక జంటగా నటించిన ఈ సినిమా శ్రీరామ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఆ తరువాత 2003లో వచ్చిన ‘ఒకరికి ఒకరు’ సినిమాతో హిట్ కొట్టాడు. తెలుగు, అటు తమిళ్ మలయాళంలో కూడా నటించిన శ్రీరామ్ సపోర్టింగ్ పాత్రలలో కూడా మెరిసాడు.
అప్పటి నుండి నాగార్జున ఫ్యాన్, అమ్మాయి అయ్యుంటే ధనుష్ ని డేట్ చేసే వాడిని….
శ్రీరామ్ పోలీస్ పోలీస్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించినా తెలుగులో మళ్ళీ అంత హిట్ అందుకోలేక పోయాడు. ఇక తమిళ్ లో హార్రర్ సినిమాలతో చేతులు కాల్చుకున్నాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాలో విజయ్, జీవా తో కలిసి నటించాడు. తెలుగులో వెంకటేష్ తో కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించాడు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక సినిమా షూటింగ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల 9 సినిమాలను కోల్పోయానని మళ్ళీ వెనక్కి వెళ్ళగలిగితే ఆ సీన్ మరో టేక్ చేయకుండా వెనక్కి వచ్చే వాడినని చెప్పారు. ఇక హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఇలియానా స్నేహితుడు సినిమా షూటింగులో ఎలా ప్రవర్తించిందో చెప్పాడు. ఒకరోజు జీవా గుడ్ మార్నింగ్ చెబితే పట్టించుకోదు, మరో రోజు చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని కోప్పడుతుంది అంటూ నవ్వాడు.
ఇక త్రిష బాగా పార్టీస్, ఫన్ గోయింగ్ అమ్మాయి అంటూ చెప్పాడు. ఇక తన ఒకరికి ఒకరు సినిమాలో హీరోయిన్ గా మొదట కత్రినా కైఫ్ ఉండాల్సింది కానీ చివరి నిమిషంలో మార్చారని చెప్పారు. ఇక నాగార్జున అభిమానిని అంటూ చెప్పారు. కలెక్టర్ గారి అబ్బాయి సినిమా షూటింగ్ అప్పుడు నాగార్జున గారిని చూసా అప్పటి నుండి ఫ్యాన్ అంటూ గ్రీకు దేవుడు లాగా ఉంటాడంటూ చెప్పాడు. ఇక ఒకవేళ అమ్మాయిగా పుట్టుంటే అన్న ప్రశ్నకు ధనుష్ తో డేట్ చేసుండేవాడినని చెప్పాడు. ఇక తాజాగా శ్రీరామ్ నటించిన టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారు. సినిమాలో అవికాగోర్ హీరోయిన్ కాగా, హిమజ, అర్చన, శ్రీనివాస రెడ్డి, తదితరులు నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…