BJP Leader: సీఎం భార్యపై వివాదస్పద పోస్టింగ్.. 'మరాఠీ రబ్రీ దేవి' గా పోల్చిన బీజేపీ సభ్యుడు..!
BJP Leader: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవితో పోలుస్తూ చేసిన అభ్యంతరకర ట్వీట్లపై ముంబై పోలీసులు మహారాష్ట్ర యూనిట్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను అరెస్టు చేశారు. వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు.
దీంతో ముంబై సైబర్ సెల్ అధికారులు మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా వింగ్ సభ్యుడు జితేన్ గజారియా కార్యాలయానికి చేరుకుని.. సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి.. వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తర్వాత అతడిని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని సైబర్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
మహారాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. సైబర్ సెల్ అధికారులు అతన్ని తీసుకురావడానికి గజారియా కార్యాలయానికి వెళ్లారు. అయితే అతడిపై ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదన్నారు.
‘మరాఠీ రబ్రీ దేవి’ అనే క్యాప్షన్‌తో రష్మీ థాకరే ఫోటోను గజారియా ట్వీట్ చేశారు. అదే రోజు.. గజారియా సిఎం థాకరే , డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ఏదో మాట్లాడుతూ ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్టు వైరల్ గా మారింది. దాణా కుంభకోణంలో అక్రమాస్తుల ఆరోపణలపై ఆమె భర్త లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయాల్సి రావడంతో 1997 జూలైలో రబ్రీ దేవి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అన్న సంగతి అందరికీ తెలిసిందే.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…