తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 79,824 మందికి కరోనా పరిక్షలు నిర్వహించగా అందులో 6,026 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,75,748 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం ఒక బులిటెన్ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే కరోనాతో 52 మంది మరణించగా, ఇప్పటి వరకు మృతి చెందినా వారి సంఖ్య 2,579కి చేరింది. ఈ మహమ్మారి నుంచి నిన్న ఒక్కరోజే 6,551 మంది బాదితులు కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
జిహెచ్ఎంసి పరిధిలో మరో 1,115 కేసులు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు దాదాపు నిండిపోయాయి. కేవలం రెండు వారాల్లో పరిస్థితి ఉగ్రరూపం దాల్చగా, కొత్తగా ఎవరైనా చేరాల్సి వస్తే బెడ్లు దొరకడం చాలా కష్టం అవుతుంది. నగరాలలోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఖాలీలున్నా బాదితుల ప్రాణ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…