General News

Omicron Cases: నవోదయ పాఠశాలలో 85మందికి కరోనా..ప్రిన్సిపాల్ తో సహా..!

Omicron Cases: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 85 మంది విద్యార్థులు కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి సోకిన విద్యార్థులను వేర్వేరు హాస్టళ్లలో ఉంచారు.

Omicron Cases: నవోదయ పాఠశాలలో 85మందికి కరోనా..ప్రిన్సిపాల్ తో సహా..!

పాఠశాలను మైక్రో-కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. మొదట్లో పదకొండు మంది విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ వారికి దగ్గర్లో కాంటాక్ట్ ఉన్న 488 మంది విద్యార్థుల నమూనాలను కూడా పరీక్ష కొరకు పంపించారు. దీంతో ఈ పరీక్షల అనంతరం 85 మంది విద్యార్థులకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

Omicron Cases: నవోదయ పాఠశాలలో 85మందికి కరోనా..ప్రిన్సిపాల్ తో సహా..!

దీంతో పాఠశాలలో మొత్తం ప్రిన్సిపాల్ తో పాటు.. 85 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు పేర్కొన్నారు.
వీళ్లంతా కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాత.. RT-PCR పరీక్ష చేయిస్తామని.. తర్వాత ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వాళ్లన డిశ్చార్జ్ చేస్తామని ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు.

మొత్తం 8కి చేరిన కేసులు..

మరికొన్ని నమూనాల నివేదికలు ఇంకా రావలసి ఉందని అధికారులు తెలిపారు. డాక్టర్ల ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థులు జ్వరం, దగ్గు మరియు ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారన్నారు. ఒక్కరోజే ఉత్తరాఖండ్ లో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరుకు ఒమిక్రాన్ కేసులు ఎనిమిదికి చేరినట్లు పేర్కొన్నారు. సోకిన వారిలో.. ఒక కేసు అహ్మదాబాద్‌లో మరియు మూడు కేసులు డెహ్రాడూన్‌లో ఉన్నాయన్నారు. కొత్త వేరియంట్‌తో ఇంతకు ముందు సోకిన నలుగురు కోలుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 11న ఒక ఒమిక్రాన్ కేసు, డిసెంబర్ 27న మరో మూడు కేసులు నమోదయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago