Nayanthara-Vignesh: పెళ్లి కాలేదు కానీ..అన్నీ జరిగిపోతున్నాయిగా..!
Nayanthara-Vignesh: నయనతార- విఘ్నేష్ శివన్ ఈ జంట ఏ సెలబ్రేషన్, ఏ అకేషన్ ఉన్నా.. విదేశాల్లో వాలిపోతున్నారు. గత మూడేళ్లుగా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరు లివింగ్ టుగేదర్ రిలేషన్ మెంటెయిన్ చేస్తున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా.. ఈ ప్రేమ పక్షులు విదేశాలకు చేక్కేస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్ల కోసం ఇటీవల దుబాయ్ కి వెళ్లారు.
అక్కడే న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బుర్జ్ ఖలీఫా ముందు ఈ ఇద్దరు లవర్స్ తెగ ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే విదేశాలకు తిరుగుతూ.. తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మాత్రం పెళ్లి ఎప్పుడంటే.. నోరు మొదపడం లేదు.
గత మూడేళ్లుగా లవ్ లో ఉన్న వీరు పెళ్లి ఎప్పుడంటే మాత్రం రేపు మాపు అంటూ రోజులను దాటేస్తున్నారు.
గతంలో కూడా పలు సందర్భాల్లో నయన్- విఘ్నేష్ శివన్ లు ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఏ పండగ వచ్చినా ఇద్దరు కలిసి జరుపుకుంటున్నారు.
ఇటీవల ఓనం జరిగిన సమయంలో ప్రైవేటు విమానంలో ఇద్దరు కేరళకు వెళ్లారు. అక్కడే పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా చెప్పే పేరు నయనతార. ఈ అమ్మడు హీారోలకు ధీటుగా పారితోషకం తీసుకుంటూ.. తన రేంజ్ ను పెంచుకుంది. గతంలో శింబుతో ప్రేమాయణం చేసిన నయన్ ఆ బంధాన్ని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయింది. తరువాత భార్య ఉండి ఇద్దరు బిడ్దలు ఉన్న ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ నడిపింది. పెళ్లి చేసుకుంటారన్న సమయంలో మళ్లీ వీరిద్దరు విడిపోయారు. తాజాగా విఘ్నేష్ శివన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. అయితే ఇది ఎప్పుడు పెళ్లికి దారితీస్తుందో తెలియాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…