Hero Nitin : కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. చైనాలో మొదలైన వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి రెండేళ్లుగా కలవరపెడుతోంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వేరియంట్స్ రూపంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం క్రితం కేవలం రోజువారీ కేసుల సంఖ్య పదివేల లోపు ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య లక్ష దాటింది. దీంతో ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా సోకింది. మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు సినీరంగ ప్రముఖులు కూడా కరోనా కనిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, సంగీత దర్శకుడు థమన్ కరోనా బారిన పడ్డారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య షాలినికి కూడా కరోనా సోకింది. ఇలా వరసగా తమ అభిమాన తారలు, సన్నిహితులు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నితిన్ తన భార్య పుట్టిన రోజు వేడుకలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. కరోనా సోకడంతో నితిన్ షాలిని పుట్టినరోజు వేడుకలను నేరుగా చేయలేకపోయాడు. కరోనాకు హద్దులు ఉంటాయి.. కానీ ప్రేమకు హద్దులు ఉండవన్న రీతిలో పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేశాడు. తన భార్య ఐసోలేషన్ రూమ్ లో ఉంటే కింద కేక్ కట్ చేస్తూ విషెస్ చెప్పాడు. మొట్టమొదటిసారి నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లు నితిన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదంతా చూడటానికి చాలా ఎమోషనల్ గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…