Featured

Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్!

Manchu Lakshmi: చైనాలో మొదలైన కరోనా… రెండేళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఆల్ఫా, బీటీ, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మారుస్తూ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.

Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్!

ఇండియాలో కూడా ఇటీవల కాలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజుకు కేవలం 10 వేలకు తక్కువగానే ఉన్న కరోనా కేసులు ఇటీవల లక్షకు చేరాయి. వారం వ్యవధిలోనే పరిస్థితి తారు మారైంది.

Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్!

ఇదిలా ఉంటే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సౌరవ్ గంగూలీతో పాటు ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు మరికొంత మంది ఎంపీలు, పలు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు.

ఇంట్లోనే ఉండండి.. ఖచ్చితంగా మాస్క్ ధరించండి..

తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే మంచు మనోజ్ కరోనా నుంచి కోలుకోగా.. మంచు లక్ష్మీ కూడా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాదాపు రెండేళ్ల నుంచి బూచోడు నుంచి తప్పించుకుంటున్నాను.. అయినా దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా.. అందుకే నన్ను విడిచిపెట్టలేదని అంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించా అంది. నాకున్న కలరీ స్కిల్స్ తో దాన్ని ఎలాగైనా పంపిస్తా అని అంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ ప్రజలకు పలు సూచనలు కూడా చేసింది. ఇంట్లోనే ఉండండి, ఖచ్చితంగా మాస్క్ ధరించండి. రెండు డోసులు టీకాను తీసుకోండి, ఒక వేళ వీలయితే బూస్టర్ డోస్ తీసుకోండంటూ ప్రజలకు సూచించింది. అలాగే టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌, షోలు, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago