తెలంగాణా రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. ఈరోజు (మంగళవారం) కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,991 కు చేరుకుంది. కాగా ఈ మహమ్మారి సోకి రాష్ట్రంలో ఈరోజు ఒకరు మృతిచెందారు. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తంగా కరోనా సోకి 57 మంది చనిపోయారు.
అయితే కరోనా నుంచి కోలుకుని ఈరోజు 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇంకా 650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,284 మంది గా నమోదైంది. ఈ ఒక్కరోజులో కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ జిల్లాలో 6 నమోదు కాగా, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మరోవైపు వలస కూలీలు-12 మంది, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…