నిత్యం వివాదాలను జేబులో పెట్టుకుని తిరిగే ఆర్జీవీ ఆఖరికి కరోనాని కూడా వదల లేదు… ఇప్పటివరకు జరిగిన అన్ని వివాదాస్పద సంఘటనలు ఆధారంగా సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ ఈసారి మహమ్మారి కరోనాపై కూడా సినిమా తీసేసాడు. కరోనా వైరస్ పై తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం తనదే అంటూ ముందుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా మొత్తం షూటింగ్స్ అన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే ఖాళీ సమయాన్ని కూడా పూర్తిగా వాడేసాడు ఆర్జీవీ. కరోనా వైరస్ పేరుతొ ఒక ఫీచర్ ఫిలిం పూర్తి చేసాడు.
అంతేకాదు ఈరోజు ఆ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేసాడు.. తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమాకు సంబంధిచిన విషయాలను వెల్లడించాడు. “ఇదిగోండి.. ఇదే కరోనా వైరస్ ట్రైలర్… లాక్ డౌన్ సమయంలోనే ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాం. దేవుడే కాదు కరోనా వచ్చినా సరే మా పనిని ఆపలేరు..” అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు. వర్మ “కరోనా వైరస్” ట్రైలర్ మీకోసం…
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…