సెలెబ్రెటీలు లైఫ్ స్టైల్ చాలా రిచ్‌గా ఉంటుంది. అందులో కొందరు అయితే చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా వాళ్ళ మెయిన్టైనెన్స్ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది. అటువంటి వారిని చూసినపుడు నెటిజన్లు పలు ప్రశ్నలు వేస్తుంటారు. అంత పెద్ద కార్ మీకు ఎక్కడిది.. భారీ ఇల్లు ఎక్కడిది అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. తాజగా బిగ్ బాస్ భామ హిమజ కూడా ఇటువంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. తెలుగు చిత్రాలలో ముఖ్య పాత్రలు చేసి పేరు సంపాదించింది ఈ ముద్దగుమ్మ. హిమజ ఇప్పటివరకు “నేను శైలజ”, “వినయ విధేయ రామ”, “స్పైడర్”, “మహానుభావుడు” వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత వచ్చిన బిగ్ బాస్ తో మరింత దగ్గరైంది.
తాజాగా కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా గడుపుతున్న హిమజ ఈ మధ్యే కొత్తగా ఖరీదైన బెంజ్ కార్ కొనేసింది.. దాంతో డబ్బులు లేవని చెప్తూనే ఇదెలా కొన్నావంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు చెప్పింది హిమజ. అయితే తాను సినిమాల్లోకి రాకముందు రకరకాల ఉద్యోగాలు చేసానని, కానీ ఆ సమయంలో సంపాదించిన డబ్బులు ఎంతమాత్రం సరిపోయేవి కాదని కేవలం అద్దెకు.. ఇతరత్రా ఖర్చులకు సరిపోయేవని చెప్పింది.
తానూ టీచర్ గా పని చేస్తున్న సమయంలో తనకు తెలిసిన అంకుల్ ఈటీవీలో భార్యామణి సీరియల్‌లో అవకాశం ఇప్పించారని గుర్తు చేసుకుంది. మొదట్లో ఇబ్బంది పడినా తరువాత మెల్లిమెల్లిగా నటించడం నేర్చుకున్నానని తెలిపింది. ఇక తాను కొన్న మెర్సిడీస్ బెంజ్ కారు గురించి మాట్లాడుతూ… ఈ కారు చాలా కష్టపడి కొన్నానని.. టాలీవుడ్ సెలెబ్రిటీని కాబట్టి బెంజ్ కంపెనీ వాళ్లు జీరో ఫైనాన్స్ కు ఈ కారు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రతీనెల నాలుగున కారు ఈఎంఐ కట్ అవుతుంది. సెలెబ్రిటీ హోదాలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కారు కొనుక్కున్నానని తెలిపింది. ఇక నీకు కార్ ఎక్కడ్నుంచి వచ్చిందని నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. “ఎప్పుడైనా తనకు డబ్బులు ఇబ్బందైతే నీకు ఫోన్ చేస్తాను.. నువ్వు వచ్చి ఈఎంఐ కట్టు.. ఎలాగూ లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల నుంచి నాకు షూటింగ్స్ లేక పని లేదు అందువల్ల ఆదాయం ఏమి లేదు.. ఆ ప్రశ్న అడిగినోడు ఈఎంఐ కడతాడేమో అడుగుతా అంటూ మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇఛ్చింది హిమజ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…