అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి, నటించిన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ భామ. అయితే ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. అంతేకాదు క్రేజ్ ఉన్న స్టార్స్ తో మాత్రమె సినిమాలు చేస్తానని తెగేసి చెబుతుంది..
ఈ నేపధ్యంలో నిఖిల్ సరసన ‘అర్జున్ సురవరం’ నటించిన లావణ్య త్రిపాటి. మరో 2 సినిమాలను సైన్ చేసి వాటి షూటింగ్‌ల కోసం ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కలకలం కారణంగా ఇకపై తను ఇంటిమేట్ సీన్స్‌ను చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వాటిలో మరీ ముఖ్యంగా లిప్‌లాక్ సీన్స్ ఉంటే వాటికి ఖచ్చితంగా చేయకూడదని నిశ్చయించుకుందట, తద్వారా తన ఆరోగ్యంతో పాటు తన చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా కాపాడగలనని ఆమె భావిస్తోంది. మొత్తానికి కరోనా వచ్చి మంచి మంచి పాఠాలు నేర్పిస్తుంది అందరికి…
ఈ క్రమలో కరోనా కు మందు కనిపెట్టలేదు కాబట్టి భవిష్యత్తులో కరోనా దరిచేరకుండా ఉండేందుకు తనకు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ . మరి లావణ్య తీసుకున్న నిర్ణయం ఆమెకు ఎంత మేరకు మేలు చేస్తుందో చూడాలి.. ఏది ఏమయినా ప్రస్తుతం లావణ్య నిర్ణయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…