Breaking: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా..! తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన..!
Breaking: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి.. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను ఎవరినీ వదిలి పెట్టడం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా మహమ్మారి సోకడం కాస్త కలవరపెడుతోంది.
అయితే కరోనా దాటి నుంచి తప్పించుకోవాలంటే.. మరో బూస్టర్ డోస్ వేసుకోవాలంటూ వైద్య అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కరోనా బారిన పడుతున్నారు.
అందులో నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన వారంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. దాంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరాడు. ఇక గత కొన్నాళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమయి.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల అతడు కుప్పంలో పర్యటించాడు. అంతే కాదు.. ఇటీవల వైసీపీ కార్యకర్తల చేతిలో కారండచెడులో అత్యంత దారుణంగా హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో కూడా పాల్గొన్నాడు. ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో అతడికి కారోనా సోకినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…