Sreeja Kalyan To Sreeja: తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె..! ఇన్‌స్టాలో పోస్టు వైరల్..!
Sreeja Kalyan To Sreeja: సెలబ్రెటీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సాధారణ ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా సిని పరిశ్రమలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. సినీ తారలు ఏం చేస్తుంటారు.. వారి కుటుంబాల్లో ఏం జరగుతుందనేది ఎప్పుడూ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది.
దీంతో ఏదో రూమర్లు, గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. చివరకు తమ సోషల్ మీడియాలో చిన్న పేరు మార్చినా.. ఊహాగానాలు మొదలవుతు ఉంటాయి. నెటిజెన్లు తమకు నచ్చినట్లుగా స్టోరీలు అల్లేసుకుంటారు. అయితే తాజాగా ఇలాంటిదే మెగా కుటుంబంలో జరిగింది. మెగాస్టార్ చిన్న కుమార్తె తన పేరు చివర ఉన్న భర్త పేరు తొలగించడంతో అనుమానాలు పెద్దవి అయ్యాయి.
ఏం జరుగుతుందో అని నెటిజెన్లు తెగ ఆసక్తికనబరిచారు. తాజాగా… ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు చివర భర్త కళ్యాణ్ పేరును శ్రీజ తొలగించడమే. సాధారణంగా తన పేరును ‘శ్రీజ కళ్యాణ్’ అని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాసుకునేవారు. ఇప్పుడు ‘కళ్యాణ్’ను తొలగించి కేవలం శ్రీజ అని మాత్రమే రాశారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘శ్రీజ కొణిదెల’ అని రాశారు. దీంతో నెటిజెన్లలో అనుమానాలు మొదలయ్యాయి.
గతంలో కూడా మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదని.. త్వరతో శ్రీజ, కళ్యాణ్ కూడా విడిపోతారని వార్తలు వినిపించాయి. అయితే శ్రీజ బర్త్ డే సమయంలో శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ గమనిస్తే… ఆయన ‘శ్రీజ కళ్యాణ్’ ఇన్‌స్టా హ్యాండిల్ ట్యాగ్ చేశారు. దీంతో అనుమానాలకు చెక్ పడింది. అయితే ఇన్నాళ్లు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న ఇన్ స్టా హ్యాండిల్ పై క్లిక్ చేస్తే పేజ్ నాట్ అవైలబుల్ అని కనిపిస్తోంది. అయితే శ్రీజ కొణిదెల పేరుతో ఇన్ స్టా హ్యండిల్ ఉంది. దీంతో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వీటిని డిలీట్ చేయలేదు. అంటే నెటిజన్లు, అభిమానుల్లో ఉన్నది కేవలం డౌట్స్ మాత్రమే అని అర్థం అవుతోంది. అయితే గతంలో ఇలాగే సమంత – నాగచైతన్య విడిపోయే ముందు సమంత అక్కినేని అనే పేరు నుంచి సమంతగా మారింది. ఆ తరువాత వీరిద్దరు విడిపోయారు. అయితే పేరు మార్చిన మాత్రాన విడిపోతారనుకోవడం అతిశయోక్తే అవుతోంది. సెలబ్రెటీల విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రాకపోవడం మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…