Balakrishna: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బాలయ్య దంపతులు..! వీడియో వైరల్..!
Balakrishna: ‘అఖండ’ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ జోరు మీద ఉన్నాడు. దీంతో పాటు ఆహా ఓటీటీలో సూపర్ సక్సెస్ అయింది. దీంతో బాలయ్యలో ఎనర్జీ మరింతగా పెరిగింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు బాలయ్య.
ఇదిలా ఉంటే ఇటీవల సంక్రాంతి సంబరాల్లో చాలా ఉత్సాహం కనిపించాడు బాలయ్య. ప్రతీ సంక్రాంతికి నారా వారి పల్లిలో ఘనంగా జరుపుకునే వారు బాలకృష్ణ. నారా- నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతిని జరుపుకునేవి. అయితే ఈసారి మాత్రం ప్లేస్ మార్చాడు.
తన సోదరి పురుంధేశ్వరి ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో జరుపుకున్నాడు. తన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞలతో సంక్రాంతి సంబంరాల్లో పాల్గొన్నాడు. నాచ్ ఘోడ గుర్రంపై ఎక్కి స్వారీ చేశాడు. తన కుమారుడు మోక్షజ్ఞ గుర్రంపై ఎక్కిన సందర్భంలో బాలయ్య కళ్లెం పట్టుకుని అదుపుచేశాడు.
ఇదిలా ఉంటే సముద్ర తీరంలో భార్య వసుంధరతో కలిసి జిప్సీ జీపులో సదరాగా గడిపారు బాలకృష్ణ. తన భార్య థంబ్ సింబల్ చూపించకుండా చేతిని ఊపుతున్నందుకు ఆమెని థంబ్ సింబల్ చూపించమని బాలకృష్ణ అంటాడు. వీరిద్దరు కలిసి బీచ్ ఒడ్డున సరదాగా చక్కర్లు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా బాలయ్య తన ఫ్యామిలీలో ఎంజాయ్ చేయడం.. చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం బాలయ్య అభిమానులకు అసలైన పండగను తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కనిపించడంతో నందమూరి అభిమానులకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…