Cm Jagan: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మద్యం అమ్మకాలకు సంబంధించి మొదటి నుంచి కూడా నిబంధనలు జారీ చేస్తు వస్తున్న ప్రభుత్వం.. తాజాగా మద్యం విక్రయ వేళలను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహించుకొవచ్చని తెలిపింది.
అంతే కాకుండా విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేసే వారు. ఈ సమయాన్ని గంట పొడిగించింది ప్రభుత్వం. మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసిన ప్రభుత్వం.. వ్యాట్ తో పాటు.. స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని క్రమబద్ధీకరించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ వేళలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సంక్రాంతికి ముందే ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉన్నా.. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోంటారనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దానిలో భాగంగానే.. రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను జనవరి 18 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ నైట్ కర్ఫ్యూ జనవరి 31 వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…