Keerthi Suresh: కీర్తి సురేష్ అభిమానులకు గుడ్ న్యూస్..! ట్వీట్టర్ వేదికగా వెల్లడించిన బ్యూటీ..!
Keerthi Suresh: కీర్తి సురేష్.. పేరు తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. ఆమె మహానటి చిత్రంలో నటకు ఎన్నో అవార్డులు.. రివార్డులు వరించాయి. అప్పటి గొప్ప నటి సావిత్రి బయోపిక్ లో సావిత్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నటించారు. నేను శైలజ చిత్రంతో ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతే కాదు.. ఎన్నో చిత్రాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెద్దన్నలో కూడా ఈమె సూపర్ స్టార్ కు చెల్లి పాత్రిలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. ‘సాని కాయిదమ్’, ‘భోళా శంకర్’, ‘వాసి’, ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడ్డట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంటే.. ఈ నెల 11న కీర్తి సురేష్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. అయితే హౌం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. ఎవరూ కంగారు పడొద్దని.. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధలను పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కీర్తి సురేష్. అయితే తాజాగా ఆమె అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు.
ఏంటంటే.. కోవిడ్ బారి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లోనే తాను కోలుకున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు.. ఆమెకు సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారిందని, నేను కోలుకోవాలని నాపై మీరందరూ చూపించిన ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అందరూసంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…