ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వివిధ వేరియంట్లలో దాడి చేస్తూ తీవ్ర అల్లకల్లోలం సృష్టించింది. ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రస్తుతం రెండవ దశలో వ్యాపిస్తున్నటువంటి ఈ వేరియంట్ ప్రపంచంలోని 60 దేశాలకు పాకిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇంగ్లాండ్ లో అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధమైన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి రెండు డోసుల వ్యాక్సిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) వెల్లడించింది.
రెండు డోస్‌ల ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 96 శాతం కేసుల్లో రోగులకు చికిత్స అవసరం లేదని నిపుణులు తెలియజేశారు. అదేవిధంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారిలో 92 శాతం కేసుల్లో అవసరాన్ని తగ్గించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తెలిపింది. మరోసారి బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో పీహెచ్ఈ ఈ ఫలితాలను వెల్లడించింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఎక్కువగా నమోదవుతున్న కేసులలో డెల్టా వేరియంట్ కావటం వల్లే ఎంతో ఆందోళన చెందుతున్న ఇంగ్లాండ్ ప్రభుత్వం జూన్ 21 నుంచి లాక్ డాన్ ఆంక్షలను సడలించాలని ఆలోచనను విరమించుకుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంగ్లండ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 50 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసినట్లు తెలియజేశారు.
గతంలో వ్యాప్తిచెందిన ఆల్ఫా స్ట్రెయిన్‌తో వేరియంట్ తో పోల్చితే డెల్టా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్ ఎంతో సమర్ధంగా పనిచేస్తోందని పీహెచ్ఈ వివరించింది. ‘‘డెల్టా వేరియంట్ నుంచి ఆసుపత్రిలో చేరడానికి టీకాలు గణనీయమైన రక్షణను అందిస్తాయని ఈ ముఖ్యమైన ఫలితాలు నిర్ధారించాయి’’ అని బ్రిటన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చీఫ్ మ్యారీ రామ్‌సే వ్యాఖ్యానించారు. ఎంతో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎంతో సమర్థవంతంగా పని చేయడం వల్ల మరణం ముప్పును తగ్గించిదని చెప్పవచ్చు.బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రెండు డోసులు వ్యాక్సిన్ కేవలం 57 శాతం మంది తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…