డెల్టా వేరియంట్ పై సమర్థవతంగా పని చేస్తున్న కరోనా టీకా!

0
205

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వివిధ వేరియంట్లలో దాడి చేస్తూ తీవ్ర అల్లకల్లోలం సృష్టించింది. ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రస్తుతం రెండవ దశలో వ్యాపిస్తున్నటువంటి ఈ వేరియంట్ ప్రపంచంలోని 60 దేశాలకు పాకిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇంగ్లాండ్ లో అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధమైన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి రెండు డోసుల వ్యాక్సిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్  (పీహెచ్ఈ) వెల్లడించింది.

రెండు డోస్‌ల ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 96 శాతం కేసుల్లో రోగులకు చికిత్స అవసరం లేదని నిపుణులు తెలియజేశారు. అదేవిధంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారిలో 92 శాతం కేసుల్లో అవసరాన్ని తగ్గించిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తెలిపింది. మరోసారి బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో పీహెచ్ఈ ఈ ఫలితాలను వెల్లడించింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఎక్కువగా నమోదవుతున్న కేసులలో డెల్టా వేరియంట్ కావటం వల్లే ఎంతో ఆందోళన చెందుతున్న ఇంగ్లాండ్ ప్రభుత్వం జూన్ 21 నుంచి లాక్ డాన్ ఆంక్షలను సడలించాలని ఆలోచనను విరమించుకుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంగ్లండ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 50 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసినట్లు తెలియజేశారు.

గతంలో వ్యాప్తిచెందిన ఆల్ఫా స్ట్రెయిన్‌తో వేరియంట్ తో పోల్చితే డెల్టా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్ ఎంతో సమర్ధంగా పనిచేస్తోందని పీహెచ్ఈ వివరించింది. ‘‘డెల్టా వేరియంట్ నుంచి ఆసుపత్రిలో చేరడానికి టీకాలు గణనీయమైన రక్షణను అందిస్తాయని ఈ ముఖ్యమైన ఫలితాలు నిర్ధారించాయి’’ అని బ్రిటన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చీఫ్ మ్యారీ రామ్‌సే వ్యాఖ్యానించారు. ఎంతో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎంతో సమర్థవంతంగా పని చేయడం వల్ల మరణం ముప్పును తగ్గించిదని చెప్పవచ్చు.బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రెండు డోసులు వ్యాక్సిన్ కేవలం 57 శాతం మంది తీసుకున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here