కరోనా ల్యాబ్ లోనే పుట్టిందట.. బయటపడ్డ డబ్ల్యూహెచ్ఓ రికార్డింగులు..?

ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన డబ్ల్యూహెచ్ఓ అంతర్గత రికార్డింగులలో వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందని తేలింది. కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి డబ్ల్యూహెచ్‌వో తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి విదితమే. డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను కరోనా విషయంలో ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదని పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడ్డారు.

అయితే తాజాగా డబ్ల్యూహెచ్‌వో అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డులు బయటపడగా ” వైరస్‌పై అధ్యయనం చేయడం ఆ ల్యాబ్ దురదృష్టం” అంటూ నిపుణులు, శాస్త్రవేత్తలు సమావేశాల్లో వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చే దేశాల విషయంలో ఒకలా మిగిలిన దేశాల విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చిన జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులు అందాయని ఆ దేశాల విషయంలో డబ్ల్యూహెచ్‌వో కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

డబ్ల్యూహెచ్‌వో నుంచి లీకైన రికార్డింగులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. జో బైడెన్ మొదట డబ్ల్యూహెచ్‌వోకు నిధులు ఇస్తామని చెప్పినా ఆడియో టేపులు లీక్ కావడంతో ఆయన ఏ విధంగా ముందుకెళతాడో చూడాల్సి ఉంది.