Categories: FeaturedGeneral News

కరోనాతో రెండేళ్ళు కాపురం చేయాల్సిందేనా..?!! షాకింగ్ రిపోర్ట్స్..

ప్రపంచంవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కోవిడ్ 19 ఇప్పటిలో తగ్గేలా కనిపించడం లేదని కనీసం రెండు సంవత్సరాలు వరకు దీని ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందిలో రోగనిరోధక శక్తి పెరిగే వరకు ఈ మహమ్మారి ప్రభావం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని తొందరగా అటాక్ చేసే గుణం ఉన్న ఈ మహమ్మారిని జలుబు తగ్గించినంత ఈజీగా కట్టడి చేయడం కుదరదని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాకు చెందిన పరిశోధకులు.

ఈ మేరకు ఒక ప్రకటించింది యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాకు చెందిన సెంటర్ ఫార్ ఇన్ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం. వైరస్ లక్షలు కనిపించక ముందే ఇది సోకిన వారిలో వ్యాధి తాలూక ఇన్ఫెక్షన్ ఉంటుందని వీరు ఇచ్చిన రిపోర్ట్ లో తెలిపారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందనే.. ప్రస్తుతానికి ఎటువంటి మెడిసిన్ లేని కారణంగా లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేని పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే వ్యాపారాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాయి. అదే సమయంలో ఈ వైరస్ విడతల వారీగా 2022 వరకు ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. దీనితో పాటుగా “ప్రస్తుత పరిస్థితులు, అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ కరోనా మహమ్మారి అంత త్వరగా అంతమయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు 2022 వరకు మానసికంగా సిద్ధమవ్వాలి” అని పరిశోధకుల మాట. వ్యాక్సిన్ తయారీ చేసే పనిలో పలు ఫార్మా కంపెనీలు నిమగ్నమయి ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

12 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

13 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

14 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

14 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

15 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

15 hours ago