సాధారణంగా సినిమా రంగంలోని తారలు పెళ్లి కాకుండానే డేటింగ్ లు – మీటింగ్ లు, ఛాటింగ్ లు, ప్రేమ వివాహాలు చేసుకోవడం, కొంతకాలం కలిసున్న తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. సినీ సెలబ్రిటీల విడాకుల విషయం ఈ మధ్య చాలా కామన్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే.. విడాకులతో పాటు విడాకులు తీసుకున్న తర్వాత జరిగే మనీ సెటిల్మెంట్స్ కూడా ఇప్పుడు సినీ ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్స్ గా మారిపోయాయి. అదేంటని మీరు ఆశ్చర్యపోకముందే కొన్ని వివరాలను మీ ముందుంచుతున్నాము.. చదివి తెలుసుకోండి.
ఈమధ్యకాలంలో హృతిక్ రోషన్, సుజానె విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ ప్రేమ జంట ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విడాకుల తర్వాత సుజానె తన భర్త హృతిక్ నుండి రూ. 400 కోట్ల భరణం డిమాండ్ చేస్తుందనే రూమర్ ఓప్పుడు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. బాలీవుడ్ లో ఒక్క హృతిక్, సుజానె మాత్రమే కాదు. గడిచిన పదేళ్ళల్లోని సినీ సెలెబ్రెటీల విడాకుల వివాదాలను పరిశీలిస్తే.. ప్రభుదేవా, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటి అగ్ర తారల విషయంలో కూడా ఇలాంటి ఖరీదైన విడాకుల సెటిల్మెంట్లు జరిగాయని క్రింది వివరాలు చదివితే మీకే అర్ధమౌతుంది.
ప్రభుదేవా-రమాలత్
ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత అతని భార్య రమాలత్‌కు దాదాపు 25 కోట్ల ఆస్తులు ఆమెకు దక్కినట్లు బాలీవుడ్ సమాచారం. అంతేకాకుండా 2 ఖరీదైన కార్లు, మరికొంత డబ్బు కూడా ముట్టజెప్పారట.
సంజయ్ దత్-రియా పిళ్లై
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన మాజీ భార్య రియా పిళ్లైతో విడిపోయినప్పుడు ఆమెకు భరణం కింద రూ. 8 కోట్ల నగదుతో పాటు, ఓ ఖరీదైన కారు కూడా ఇచ్చాడని సమాచారం.
కరిష్మా కపూర్, సంజయ్ కపూర్
కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్‌తో విడిపోయిన విషయం విదితమే. కానీ నేటి వరకు ఆమె విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టలేదు. భర్త నుండి రూ. 7 కోట్లు రావాల్సివుందనే కారణంతోనే ఆమె సంతకం పెట్టలేదని బాలీవుడ్ సమాచారం.
సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్
సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృత సింగ్‌తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న తర్వాత అమృతకు భారీ మొత్తంలోనే ఆస్తులు అందిన్నట్లు బాలీవుడ్ సమాచారం.
ఆదిత్య చోప్రా- పాయల్ ఖన్నా
బాలీవుడ్ బడా నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడిపోయిన తర్వాత విడాకులు తీసుకునే టైంలో అతను భారీ మొత్తాన్నే పాయల్ కు భరణం కింద చెల్లించినట్లు బాలీవుడ్ సమాచారం.
ఇదండీ.. ఖరీదైన విడాకుల వెనుక దాగివున్న బాలీవుడ్ తారల భాగోతం. బాలీవుడ్ తారలా.. మజాకా..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…