couple caught hugging on moving bike in pune
పూణే నగరంలోని ఖేడ్-శివపూర్ ప్రాంతంలో ఒక దంపతులు బహిరంగంగా రొమాన్స్‌కు దిగడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. నడిరోడ్డుపై, అది కూడా మిట్టమధ్యాహ్నం సమయాన ప్రజలందరిలో, ట్రాఫిక్ మధ్యలో, సిగ్గు లేకుండా ఆ దంపతులు చేసిన ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఒక బైక్‌ను భర్త నడుపుతుండగా, అతని భార్య ఆ బైక్ ట్యాంక్‌పై వ్యతిరేక దిశలో కూర్చొని హగ్గులు, ముద్దులతో బహిరంగ రొమాన్స్ చేశారని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన ప్రయాణికులు షాక్‌కి గురవగా, కొందరు ఫోన్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది.
ఈ ఘటనకు సోషల్ మీడియాలో రీల్స్ తీయాలన్న ఉద్దేశమే కారణమని తెలుస్తోంది. వీడియోలో కనిపించిన భార్య తన ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకున్నప్పటికీ, నెటిజన్లు వారిని గుర్తించే ప్రయత్నంలో పడిపోయారు. ఇలా బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించడం నేరం కిందకు వస్తుందంటూ, చాలా మంది పోలీసులకు ట్యాగ్ చేస్తూ వారికి కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు.
నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన కొన్ని వ్యాఖ్యలు:
భారత శిక్షా స్మృతిలోని అవహేళనాయుత ప్రవర్తన, బహిరంగ అసభ్యత అనే సెక్షన్ల కింద ఇలాంటి చర్యలపై కేసులు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై అధికారిక స్పందన వచ్చేంత వరకు, నెటిజన్ల ఆగ్రహం మాత్రం తగ్గేలా కనిపించదు. పబ్లిక్ ప్లేస్‌లో వ్యక్తిగతమైన హద్దులు దాటడం సామాజిక బాధ్యతను విస్మరించినట్టే అని అనిపిస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…