మన టాలీవుడ్ అగ్ర నటులు పేరుకే హీరోలు.. కానీ నిజ జీవితంలో మాత్రం జీరోలు అని రుజువైంది.. కరోనా మహమ్మారి ప్రస్తుత సమాజంలో అతి పెద్ద సమస్యగా మారి అందర్నీ ఎంతో బాధ పెడుతున్న తరుణంలో ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలకు తమ సమస్య చెప్పుకోవడం కంటే, సోను సూద్ కి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుందనే నమ్మకం రోజురోజుకూ ప్రజలలో పెరిగిపోతుంది.
ఇప్పటికే సోనూ సూద్ కి సాయం చేయమంటూ కాల్స్ అధికంగా వస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభ సమయంలో సోను సూద్ అందరికీ ఆశా జ్యోతిగా కనిపిస్తున్నాడు. సాయం అడిగిన ప్రతివారికి సేవ చేస్తున్నాడు. ఆపదలో ఉన్నాం అని మెసేజ్ చేస్తేనే.. నేను ఉన్నానంటూ ముందుకు వెళిపోతున్నాడు. గత ఏడాది లాక్డౌన్ పీరియడ్ లో సోనూ చేసిన సేవ గొప్పది అని సరిపుచ్చలేం. అది అతని మంచి తనం అని తక్కువ చేసి మాట్లాడలేం.ప్రభుత్వాలు చేయలేని మంచిని అతను చేశాడు.
అందుకే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రాగానే అందరూ ప్రభుత్వాలను అడగడం మానేసి.. సోనూ సూద్ సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు సిగ్గు పడాలి. మన స్టార్ హీరోలు సోనూ కాళ్ళు కడిగి ఆ నీళ్లను దాచుకుని రోజూ తీర్ధంలాగా సేవించాలి. లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్లు వేసే నటుడు, రోజుకు ఇంత అని రెమ్యునరేషన్ తీసుకునే నటుడు ఇంత గొప్ప సేవ చేస్తుంటే..మరి ఒక్కో సినిమాకు ఏభై కోట్లు అరవై కోట్లు తీసుకునే మన హీరోలు ఏమి పీకుతున్నారు ? మా అభిమానులే మా ప్రాణం అని చెప్పే హీరోలను, ఆ అభిమానులందరూ చెప్పులతో తరిమికొట్టాలి.
ఒక్క హీరోనైనా ఈ కరోనా కష్టకాలంలో తమ అభిమానులకు ఏదైనా మేలు చేశాడా ? ఆసుపత్రిలో బెడ్స్ దొరకడం లేదు. మందుల విషయంలో దేశమంతా కొరత ఉంది. పైగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉంది, దాంతో సాయం చేయమని ప్రజలందరూ సోను సూద్ కి కాల్స్, మెసెజ్ లు పెడుతున్నారు..వాటికి రెస్పాండ్ అవుతూ ముందుకెళ్తున్నాడు సోనూసూద్.. ఇన్ని జరుగుతున్నా మాత్రం మన హీరోలు అసలు ఏం పట్టనట్టు ఉంటున్నారు.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనోళ్లు పేరుకే హీరోలని..నిజమే కదా..మరి మీరేం అంటారు….!!
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…