ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిండు గర్భిణీ గా ఉన్న ఓ తల్లికి కరోనా సోకితే ఆ బాధ ఎలా ఉంటుంది? సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా.. కరోనా బారినపడితే ఆ తల్లి ఎంతగా భయపడి ఉంటుంది ?ఆ కుటుంబం ఎంతగా నలిగిపోయి ఉంటుంది ?ప్రముఖ నటి హరితేజ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కరోనా కారణంగా ఎంతగా నరకం అనుభవించిందో తాజాగా ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది.
డెలివరీ సమయంలో హరితేజ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ భావోద్వేగ వీడియోలో చెబుతూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో డెలివరీకి కొన్నిరోజుల ముందు తమ ఇంటిల్లిపాది కరోనా బారిన పడ్డామని, ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని హరితేజ చెప్పుకొచ్చింది. అలాగే కరోనా విషయంలో కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారంటూ హరితేజ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాటల్లోనే ‘డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు హాస్పిటల్ కి వెళ్లాను.
డాక్టర్లు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉంది, సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు. అప్పుడు నేను చాల ఆనందపడ్డాను అని చెప్పింది.అయితే డెలివరీ సమయం దగ్గర పడే టైంలో హరితేజ ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు హరితేజ పడిన ఆవేదనను ఆమె మాటల్లోనే.. ‘ఆ సమయంలో నేను ఎంతో కంగారుగా, భయంగా అనిపించింది. అప్పటివరకూ నాకు వైద్యం అందించిన డాక్టర్లు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కొవిడ్ హాస్పిటల్ లో చేరాను. సర్జరీ చేయాల్సి వచ్చింది. నాకు పాప పుట్టింది.
పాపకు కొవిడ్ పరీక్ష చేయగా నెగటివ్ గా నిర్ధారణ అయినప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. దాంతో పాపని నాకు దూరంగా ఉంచారు. రోజూ వీడియో కాల్స్ చేసి పాపని చూసేదాన్ని. పాపకు పాలు ఇవ్వలేకపోతున్నానే అని చాల బాధ పడ్డాను. చికిత్స అనంతరం నన్ను ఇంటికి పంపించారు. దేవుడు దయ వల్ల మా ఇంట్లో వారందరికీ నెగటివ్ వచ్చింది” అని హరితేజ చెబుతూ భావోద్వేగానికి లోనైంది…ప్రస్తుతం సోషల్ మీడియాలో హరితేజ పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఎమోషనల్ అయిపోతున్నారు..!!
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…