Health News

సోయా తింటే ఆ సమస్య తగ్గుతుందట.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ఈ ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా మన ఆహారంలో మార్పులు సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడి అనేక వ్యాధులతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. అందులో ప్రధానంగా చిన్నా, పెద్దా అని తేడాలేకుండా వస్తున్న సమస్య థైరాయిడ్. మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

థైరాయిడ్‌ గ్రంధి మెడ ముందు భాగంలో ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరంలో పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదు కంటే తక్కువగా హార్మోన్‌ను విడుదల చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అని, ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు.థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది . మనకు అయోడిన్ సముద్రపు ఉప్పు, షెల్ఫిష్, ఉప్పునీటి చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులో సమృద్ధిగా లభిస్తుంది.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు అలసట, డిప్రెషన్,బరువు పెరగటం, జుట్టు ఊడిపోవటం, బుద్ధి మందగించటం, మలబద్ధకం, నిద్రలేమి, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవటం, వంటి ప్రధాన సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది.అయితే, ఈ సమస్యను సోయా తినడం ద్వారా అధిగమించవచ్చునని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సోయాను ఎక్కువగా తీసుకొనే ప్రజల్లో థైరాయిడ్ సమస్యలేనట్లు తేలింది. సోయాతో చేసిన వంటకాలు మెనోపాజ్ లక్షణాలను నెమ్మది చేస్తాయి. ఐసోఫ్లేవోన్స్‌లో ఈస్ట్రోజెన్ లక్షణాలు ఎక్కువ.

సోయాను అతిగా తీసుకున్నా ప్రమాదమేనని మరికొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటున్నప్పుడు, సోయా శరీరంలోని థైరాయిడ్ హార్మోన్‌ను పీల్చుకోవడంలో అడ్డుపడవచ్చు. అందువల్ల థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వైద్యుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago